COVID 19: దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి: గులేరియా

దేశంలో కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్‌ ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. విశాఖపట్నంలోని

Updated : 14 Aug 2021 16:27 IST

విశాఖపట్నం: దేశంలో కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్‌ ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు గులేరియా విశాఖ వచ్చారు. గులేరియాకు గీతం విద్యా సంస్థల ఛైర్మన్‌ శ్రీభరత్‌ గీతం ఫౌండేషన్‌ డే అవార్డును అందించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పిల్లలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందన్న దానికి సరైన అధ్యయనం లేదని, కేవలం వాళ్లకు వ్యాక్సినేషన్‌ కాలేదు కాబట్టి ఎక్కువగా వైరస్‌ బారిన పడేవాళ్లలో వీరు అధికంగా ఉంటారని అంచనా వేస్తున్నారన్నారు.

ప్రత్యేకంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని, కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో కేసుల కట్టడి ఇప్పుడు బాగుందని చెప్పిన ఆయన, హఠాత్తుగా ఒక ప్రాంతంలో కేసుల విజృంభణ జరిగితే వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాల్లో కేసులు వ్యాపించకుండా ఉంటాయన్నారు. కరోనా వైరస్‌పై ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని, వైరస్‌ కూడా వేరు విధాలుగా రూపాంతరం చెంది వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉందన్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని, వ్యాక్సిన్‌ ప్రభావం నుంచి వైరస్‌ తప్పించుకోగలిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని గులేరియా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని