Rain Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.

Updated : 07 Jun 2023 16:44 IST

హైదరాబాద్: తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడిందని పేర్కొంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం జిల్లాల్లో.. రేపు, ఎల్లుండి అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ మోస్తరు వర్షాలు..

రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ వేగంతో వేడి గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని