Published : 25 Oct 2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

1. నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదు: సీఎం జగన్‌

నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదని.. పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. బోధన సిబ్బందిలో నాణ్యతతో పాటు ఉన్నత ప్రమాణాలు ఉండేలా నియామకం ఉండాలన్నారు.

2. దళితబంధు నిలిపివేతపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌

హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఇవాళ విచారణకు వచ్చాయి. సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. పథకం నిలిపివేతపై దాఖలైన మూడు ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించి వాదనలు ముగియడంతో ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

3. ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. 

4. రాష్ట్రపతి పాలన విధించాలి.. డీజీపీని రీకాల్‌ చేయాలి: చంద్రబాబు

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని.. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. తెదేపా నేతలతో కలిసి దిల్లీలో రాష్ట్రపతితో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆయా రాష్ట్రాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. దేశం, అంతర్జాతీయంగా ఎక్కడా లేని లిక్కర్‌ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. 

‘రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకే దిల్లీకి చంద్రబాబు’

5. నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు ‘సుప్రీం’ బ్రేక్‌.. కేంద్రానికి ఆదేశాలు

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసింది. నీట్‌లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

6. వాంఖడేపై ఎన్‌సీబీ విచారణ ప్రారంభం

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్‌ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై తమ శాఖ జోనల్ డైరెక్టర్‌పై ఎన్‌సీబీ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఆ సంస్థ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. ‘ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అది నా నేతృత్వంలోనే జరుగుతుంది’ అని చెప్పారు.

7. ప్రియాంక మరో హామీ.. ₹10 లక్షల వరకు ఉచిత వైద్యం!

యూపీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. యూపీలో తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు  ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలందరికీ రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని వెల్లడించారు.

8. చైనాను ఐరాస గుర్తించి 50 ఏళ్లు.. జిన్‌పింగ్‌ కీలక వ్యాఖ్యలు

పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పీఆర్‌సీ)ను ఐరాస అధికారికంగా గుర్తించి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఎల్లప్పుడూ ప్రపంచ శాంతిని కోరుకుంటుందని, అంతర్జాతీయ నియమాలను పాటిస్తుందని పేర్కొన్నారు. చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇటీవల తారస్థాయి చేరుకున్న తరుణంలో జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

9. ఈ అవార్డుని వారికి అంకితమిస్తున్నా: రజనీకాంత్‌

తనకు వచ్చిన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుని తన గురువు, అన్నయ్య తదితరులకి అంకితమిచ్చారు రజనీకాంత్‌. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకి రజనీకాంత్‌ చేస్తోన్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ అవార్డుని స్వీకరించిన రజనీకాంత్‌ తన మనసులోని మాట పంచుకున్నారు. తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరినీ గుర్తుచేసుకున్నారు. 

జియోనెక్ట్స్‌ ఫోన్‌లో కొత్త ఓఎస్‌.. ఫీచర్లివే! 

10. ఆనందం సరే.. అతిచేయవద్దు..

టీమ్‌ఇండియాపై చారిత్రక విజయం సాధించాక పాకిస్థాన్ ఆటగాళ్లకు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరిన విధంగా సెలబ్రేషన్స్‌ చేసుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించాడు. ఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియాపై ఒక్కటే గెలవడానికి రాలేదని, ప్రపంచకప్‌ సాధించేవరకు కష్టపడాలన్నాడు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని