Guntur: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వినూత్న నిరసన..

గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. ఊరూరు తిరిగి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పిన జగన్‌ మూడేళ్లు గడిచినా ఎలాంటి  నోటిఫికేషన్లు విడుదల చేయలేదని ఆరోపించారు.

Published : 06 May 2022 20:36 IST

గుంటూరు: గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. ఊరూరు తిరిగి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పిన జగన్‌ మూడేళ్లు గడిచినా ఎలాంటి  నోటిఫికేషన్లు విడుదల చేయలేదని ఆరోపించారు. జాబ్‌ మేళా అంటూ పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేస్తున్నారు. అక్కడ చూస్తే సెక్యూరిటీ గార్డులు, ప్యూన్‌, గుమస్తా ఉద్యోగాలు ఉంటున్నాయి. పెద్దపెద్ద చదువులు చదివి ఆ ఉద్యోగాలు చేయాలా అని ప్రశ్నించారు. మీరు మీరు ఇవ్వాల్సింది ప్రైవేటు ఉద్యోగాలు కావు. ప్రభుత్వ ఉద్యోగాలు అని స్పష్టం చేశారు. ఇస్తామిన హామీ ఇచ్చిన 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్లను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద మాంసం, చేపలు, చికెన్ విక్రయించారు. ఈ నెల 7న విశ్వవిద్యాలయంలో నిర్వహించే జాబ్ మేళా వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని