AP News: వహ్వా.. విశాఖ మన్యంలో కనువిందు చేస్తున్న మేఘాల కొండలు..

విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వారం రోజులుగా శీతల గాలులు వీస్తుండటంతో గిరిజనులు ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు...

Updated : 22 Dec 2021 15:50 IST

పాడేరు పట్టణం: విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వారం రోజులుగా శీతల గాలులు వీస్తుండటంతో గిరిజనులు ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పాడేరు, చింతపల్లి మండలాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

చింతపల్లి పరిధిలోని లంబసింగిలో 5.2, 6.7, 7.2 డిగ్రీలు.. పాడేరు పరిధిలోని మినుములూరు కాఫీ బోర్డులో 7.13, 8.22, 8.26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం రెండు, మూడు గంటల నుంచి చలి గాలులు వీస్తున్నాయి. శీతాకాలంలో మన్యం అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

కనువిందు చేస్తున్న వంజంగి మేఘాల కొండ..

పాడేరు మండలం వంజంగి వద్ద మేఘాల కొండ పర్యాటకులను కనువిందు చేస్తోంది. కొండ పైనుంచి కనిపిస్తున్న మేఘాలను చూసి సందర్శకులు మధురానుభూతికి లోనవుతున్నారు. సెల్ఫీలు దిగడంతో పాటు అక్కడి మనోహర దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని