SCR: దసరా సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు: దక్షిణ మధ్య రైల్వే

దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను

Published : 27 Sep 2022 01:43 IST

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ఓ ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 9వ వరకు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.

సికింద్రాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక  సర్వీసులు..

దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్‌కు ఈనెల 28న, యశ్వంత్ పూర్-సికింద్రాబాద్‌కు 29న, తిరుపతి-సికింద్రాబాద్‌కు అక్టోబర్ 9న, సికింద్రాబాద్-తిరుపతికి 10న ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని