APSRTC: అద్దె బస్సులకు ఆహ్వానం
రాష్ట్రంలో భారీగా అద్దె బస్సులను తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 659 అద్దె బస్సులు తీసుకోవాలని
విజయవాడ: రాష్ట్రంలో భారీగా అద్దె బస్సులను తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 659 అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. 9 ఏసీ స్లీపర్ బస్సులు, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర, 46 సూపర్ లగ్జరీ బస్సులు, 22 అల్ట్రా డీలక్స్, 70 ఎక్స్‌ప్రెస్, 208 అల్ట్రా పల్లె వెలుగు, 203 పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా పలు రకాల బస్సులు, సంఖ్య నిర్ణయించి ఆమేరకు టెండర్లు పిలిచారు. ఆసక్తి కలిగిన వారు MSTC ఈ కామర్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని వెల్లడించారు. http://apsrtc.ap.gov.in వెబ్ సైట్లో టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు