Srisailam: శ్రీశైలం ఆలయ పురవీధుల్లో కన్నడ భక్తుల వీరంగం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ పురవీధుల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు.

Updated : 31 Mar 2022 09:37 IST

శ్రీశైలం ఆలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ పురవీధుల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. ఓ టీ దుకాణం వద్ద కన్నడ భక్తులు, స్థానికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై దాడి జరిగింది. కన్నడ యువకులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. ప్రతిదాడిలో కన్నడ భక్తుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వెంటనే బాధితుడిని 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు.

కన్నడ భక్తుల దాడులను స్థానిక పోలీసులు నిలువరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. కన్నడ యువకుల దాడులతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. అర్ధరాత్రి డీఎస్పీ శృతి శ్రీశైలం చేరుకున్న తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.  ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈ ఘటన జరగడంపై విమర్శలు వస్తున్నాయి.

 


 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని