Updated : 27 Apr 2022 13:15 IST

Andhra News: నంద్యాల జిల్లాలో పది ప్రశ్నపత్రం లీక్‌.. చిత్తూరు జిల్లాలో వదంతులు

నంద్యాల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పది ప్రశ్నపత్రం లీక్‌ అయింది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వెలుగుచూసింది. సూపర్‌వైజర్‌, ఇన్విజిలేటర్‌ పేపర్‌ను లీక్‌ చేసినట్లు సమాచారం. పేపర్‌ లీక్‌పై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్నపత్రం ఎక్కడ లీకైందో తమకు తెలియదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి పేపర్‌ లీక్‌ విషయాన్ని తీసుకెళ్లారు.

ఈ విషయంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని డీఈవో పురుషోత్తం తెలిపారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ వార్తలు నమ్మొద్దని చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ చెప్పారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని.. చిత్తూరు జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఏపీలో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని