TS TET: తెలంగాణలో టెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రాథమిక కీ విడుదలైంది. tstet.cgg.gov.inలో టెట్‌ ప్రాథమిక కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ తెలిపారు. సమాధానాలపై

Updated : 20 Oct 2022 16:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రాథమిక కీ విడుదలైంది. tstet.cgg.gov.inలో టెట్‌ ప్రాథమిక కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే జూన్‌ 18 లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 12 టెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్‌-1కు 3,18,506 (90.62శాతం), పేపర్‌-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 27న టెట్‌ ఫలితాలను విడుదల కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని