Revanth Reddy: పాలమూరులో సీఎం రేవంత్‌.. కల్వకుర్తి ఇరిగేషన్‌ లిఫ్ట్‌పై కీలక ఆదేశాలు

పాలమూరు జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలలో రూ.396 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Published : 09 Jul 2024 16:27 IST

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలలో రూ.396 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాలమూరు వర్సిటీ ఎస్టీపీ, అకడమిక్‌ బ్లాక్‌, గ్యాలరీ పనులకు, ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌, గండీడ్‌ కేజీవీబీ భవన నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. 2025 డిసెంబర్‌లోపు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని సూచించారు. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని