Revanth Reddy: పెద్దపల్లి, నారాయణపేట ఘటనలపై సీఎం రేవంత్‌ సీరియస్‌

నారాయణపేట జిల్లాలో హత్య, పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

Published : 14 Jun 2024 21:49 IST

హైదరాబాద్‌: నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన అమానుష ఘటనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. భౌతిక దాడులు, అరాచకాలు, హత్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అమానుషంగా హత్య చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపైనా సీఎం సీరియస్‌ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని