TG News: కొడంగల్‌లో విద్యాసంస్థల నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.45 కోట్లు  మంజూరు చేసింది.

Updated : 13 Jun 2024 19:46 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.45 కోట్లు మంజూరు చేసింది. కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల కోసం రూ.23.45 కోట్లు, బొమ్మరసిపేట మండలం బురాన్‌పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల, కాలేజీ నిర్మాణానికి మరో రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని