TG News: వీధి కుక్కల నియంత్రణకు కమిటీ.. జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌లో వీధి కుక్కల నియంత్రణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published : 10 Jul 2024 20:02 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వీధి కుక్కల నియంత్రణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఉదాసీనంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై దాఖలైన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసి.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని