KTR: భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated : 14 Jun 2024 22:33 IST

హైదరాబాద్‌: సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన భారాస నేత కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల ఆర్వోలకు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్‌ నామినేసన్ సందర్భంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్‌ అధికారిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని