Nimmagadda Prasad: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు

జగన్‌ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

Updated : 08 Jul 2024 19:49 IST

హైదరాబాద్‌: జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్ ఛార్జిషీట్ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసు నుంచి తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేసుకోవడానికి అనుమతినిచ్చింది. నిమ్మగడ్డ డిశ్చార్జి పిటిషన్ వేస్తే ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టుకు హైకోర్టు సూచించింది.

గుంటూరు, ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్‌ ప్రభుత్వం సుమారు 13వేల ఎకరాల భూములను కేటాయించింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు ముుసుగులో నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు రూ. 1,426 కోట్ల విలువైన భూములను కేవలం రూ.165 కోట్లకే దక్కించుకున్నారని సీబీఐ అభియోగం మోపింది. ప్రతిఫలంగా జగన్‌కు నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 854 కోట్లు లంచం ఇచ్చారని ఛార్జిషీట్‌లో వెల్లడించింది. నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు ఛార్జిషీట్‌లోని నిందితులపై సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. అయితే తన పేరు తొలగించాలంటూ నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కుట్రలో నిమ్మగడ్డ ప్రసాద్‌దే కీలక పాత్ర అని సీబీఐ వాదిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని