TGS RTC: ఆ ప్రచారం నమ్మొద్దు.. సాధారణ బస్సు ఛార్జీలు పెంచలేదు: టీజీఎస్‌ ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (TGS RTC) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.

Published : 13 Jun 2024 00:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (TGS RTC) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని సంస్థ ప్రకటించింది. హైవేలపై టోల్‌ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. పెంచిన టోల్‌ ఛార్జీల మేరకు టికెట్‌లోని టోల్‌సెస్‌ను సవరించినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సవరించిన టోల్‌ సెస్‌ జూన్‌ 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.

టోల్‌ ప్లాజాలున్న రూట్లలోనే టోల్‌సెస్‌ను యాజమాన్యం సవరించిందని అధికారులు వెల్లడించారు. సాధారణ రూట్లలో టికెట్‌ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. సాధారణ బస్‌ ఛార్జీలను టీజీఎస్‌ ఆర్టీసీ పెంచిందని ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని యాజమాన్యం ఖండించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు శాఖ సహకారంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని