హస్తరేఖల్ని మార్చేస్తున్న థాయ్ కంపెనీ..!
హస్తసాముద్రికం అంటే.. హస్తరేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక శాస్త్రం. భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఈ హస్తసాముద్రికం మనుగడలో ఉంది. మన జీవితం మన చేతిరేఖలపై ఆధారపడి ఉందని చాలా మంది నమ్ముతారు. అరచేతిలో ఉండే ఒక్కో రేఖ.. ఆరోగ్యం,
(ఫొటో: మహాహెంగ్999 కంపెనీ ఫేస్‌బుక్)
ఇంటర్నెట్ డెస్క్: హస్తసాముద్రికం అంటే.. హస్తరేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక శాస్త్రం. భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఈ హస్తసాముద్రికం మనుగడలో ఉంది. మన జీవితం మన చేతిరేఖలపై ఆధారపడి ఉందని చాలా మంది నమ్ముతారు. అరచేతిలో ఉండే ఒక్కో రేఖ.. ఆరోగ్యం, ఆయుష్షు, వివాహం, సంతానం, అదృష్టం, ఆర్థికం ఇలా ఒక్కో అంశాన్ని సూచిస్తాయట. థాయ్‌లాండ్ ప్రజలు ఈ హస్తసాముద్రికాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఆ నమ్మకాన్నే ఓ కంపెనీ ఇప్పుడు క్యాష్ చేసుకుంటోంది. అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తామంటూ అమాయక ప్రజలను ఆకర్షిస్తోంది.
థాయ్‌లాండ్‌కి చెందిన ప్రొఫెసర్ ప్లీ అనే వ్యక్తి గతంలో టాటూలు వేసే వృత్తిలో ఉండేవారు. ఇటీవల నొంతాబురి ప్రాంతంలో ‘మహాహెంగ్999’ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించి.. ప్రజలు మెరుగైన జీవితం పొందడం కోసం వారి చేతిలోని రేఖలను కావాల్సినట్టుగా మారుస్తామని ప్రకటించారు. దీంతో దివ్యమైన భవిష్యత్తుకోసం ప్రజలు ఆ కంపెనీ ముందు క్యూ కట్టారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ముందుగా హస్తసాముద్రికం తెలిసిన నిపుణులు హస్తరేఖల్ని చూసి ఏవి బలహీనంగా ఉన్నాయో.. ఏయే రేఖల్ని మార్చుకోవాలో చెప్తారట. వారు సూచించిన మేరకు కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తరేఖల్ని మార్చడం.. కొత్తవి గీయడం వంటివి చేస్తున్నారు.
(ఫొటో: మహాహెంగ్999 కంపెనీ ఫేస్‌బుక్)
టాటూల తరహాలోనే అరచేతిలో రంగులు లేకుండా గీతల్ని గీస్తున్నారు. మొదట్లో చర్మం బాగా కందిపోతుంది. ఆ తర్వాత అవి సహజరేఖల్లానే కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు.. కరోనా సంక్షోభంలో కష్టాల్ని అనుభవిస్తున్నవారు.. హస్తరేఖల్ని మార్చుకోవడం కోసం కంపెనీ ముందు బారులు తీరుతున్నారు. కనీసం ఇలాగైనా తమ జీవితంలో మంచి రోజులు వస్తాయోమోనని భావిస్తున్నారు. అనతికాలంలోనే ఈ కంపెనీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీంతో కస్టమర్లు అధికంగా వస్తుండటంతో ప్లీ బిజినెస్ బాగా నడుస్తోంది. ఈ కంపెనీకి మరో బ్రాంచ్‌ను కూడా ప్రారంభించనున్నారట. తన హస్తరేఖల్ని మార్చుకోవడం వల్లే తన వ్యాపారం అభివృద్ధి చెందిందని ప్లీ చెబుతున్నారు. పలువురు కస్టమర్లు కూడా చేతిగీతల్ని మార్చుకున్న తర్వాత మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారట. చేతిరేఖల్ని నమ్మడమే విడ్డూరం అనుకుంటే.. ఏకంగా కృత్రిమ రేఖల్ని సృష్టించడం మరింత విడ్డూరం కదా..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Tamil Nadu: తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ
-
India News
Toll tax : ఏంటీ టోల్ ట్యాక్స్.. ఎందుకు చెల్లించాలి!
-
Movies News
OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/సిరీస్‌లివే
-
India News
Indigo: మద్యం తాగి విమానంలో వాంతులు.. టాయిలెట్ వద్ద మలవిసర్జన
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల లిస్ట్ చూశారా..?
-
Movies News
Tollywood: శ్రీరామ నవమి స్పెషల్.. సందడి చేస్తోన్న కొత్త పోస్టర్లు