హలో..! మీ డెత్‌ సర్టిఫికెట్‌ వచ్చి తీసుకువెళ్లండి..

అతడి పేరు చంద్రశేఖర్‌ దేశాయ్‌. మహారాష్ర్టలోని ఠాణే వాసి. రోజులాగే పనిలో నిమగ్నమై ఉన్నాడతను. అప్పుడే ఒక  కాల్‌ వచ్చింది.  అప్పటి దాకా సరదాగా ఉన్న ఆవ్యక్తి కాస్త.. ఆ ఫోన్‌ కాల్‌ మాట్లాడటంతో ఒక్కసారిగా

Updated : 03 Jul 2021 20:21 IST

ఆ ఫోన్‌ కాల్‌తో ఒక్కసారిగా ఖంగుతిన్న వ్యక్తి

ఠాణే: అతడి పేరు చంద్రశేఖర్‌ దేశాయ్‌. మహారాష్ర్టలోని ఠాణే వాసి. రోజులాగే పనిలో నిమగ్నమై ఉన్నాడతను. అప్పుడే ఒక  కాల్‌ వచ్చింది.  అప్పటి దాకా సరదాగా ఉన్న ఆవ్యక్తి .. ఆ ఫోన్‌ కాల్‌ మాట్లాడటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ‘‘సార్‌..ఠాణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి మాట్లాడుతున్నాం.. వచ్చి మీ మరణ ధ్రువీకరణ పత్రం (డెత్‌సర్టిఫికెట్‌) తీసుకెళ్లండి’’ అన్నది ఆ ఫోన్‌ కాల్‌ సారాంశం. అసలేమి జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటం మొదలైన చంద్రశేఖర్‌ వెంటనే ఠాణే మున్సిపల్‌ కేంద్రానికి ముందుగా తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఆపై తనకు వచ్చిన కాల్‌ వివరాలను వెల్లడించాడు. వెంటనే స్పందించిన ఠాణే మున్సిపల్‌ కమిషనర్‌ సందీప్‌ మాల్వీ తగిన వివరణ ఇచ్చారు. ‘‘ దీనికి అసలు కారణం టెక్నికల్‌ ఎర్రర్‌. ఈ జాబితా మేము తయారుచేసినది కాదు, పుణె మున్సిపల్‌ కార్యాలయం నుంచి మాకు అందింది. ఇదే అంశంపై మళీ ఒకసారి సమీక్షించాలని మా బృందానికి ఆదేశాలు జారీ చేశాం అంటూ వివరించారు. కాగా బతికి ఉన్న వ్యక్తికే  ఇలాంటి ఫొన్‌ కాల్‌ రావడంతో ఈ వార్త కాస్త ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇదేదో యమధర్మరాజుకే పంపించాల్సిందని ఒకరంటే.. నేనింకా బతికే ఉన్నా ఇంకా చనిపోలేదన్న ఫన్నీ మీమ్స్‌ నవ్వులు పూయిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని