Modi: ప్రాణాలతో రాగలిగా.. మీ సీఎంకు కృతజ్ఞతలు: మోదీ ఆగ్రహం

పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసహనం వ్యక్తం చేశారు. భద్రతా లోపం కారణంగా మోదీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌

Updated : 06 Jan 2022 04:41 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసహనం వ్యక్తం చేశారు. భద్రతా లోపం కారణంగా మోదీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌.. ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. అక్కడ మోదీ అధికారులతో మాట్లాడుతూ.. ‘‘మీ సీఎంకు(పంజాబ్‌ ముఖ్యమంత్రి) కృతజ్ఞతలు. కనీసం నేను భఠిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా’’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. 

పంజాబ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ నేడు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కార్యక్రమ వేదికకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌ మార్గంలో ఓ ఫ్లైఓవర్‌ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్‌ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైనే ఉన్న మోదీ.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.

అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయ్యింది. పంజాబ్‌ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే భద్రతాలోపం తలెత్తిందని ఆరోపించింది. అటు భాజపా నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ కుట్రపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని