Anand Mahindra: మంచుకొండల్లో సైనికుల కబడ్డీ.. ఆనంద్ మహీంద్రా కామెంట్!
మంచుకొండల్లో భారత సైనికులు కబడ్డీ ఆడుతున్న వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మన ప్రాచీన క్రీడ (కబడ్డీ)కి ఉన్న అందం ఇదే.......
ఇంటర్నెట్ డెస్క్: నిత్యం ఆసక్తికర విషయాలను పంచుకుంటూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన పెట్టే పోస్టులు చూసేందుకు నెటిజన్లు ఎంతో ఆతృత కనబరుస్తారు. ఈ వ్యాపార దిగ్గజం తాజాగా మరో వీడియోను పంచుకున్నారు. మంచుకొండల్లో భారత సైనికులు కబడ్డీ ఆడుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మన ప్రాచీన క్రీడ (కబడ్డీ)కి ఉన్న అందం ఇదే. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి ప్రదేశంలోనా ఆడొచ్చు. అందుకే ఈ క్రీడ పునరుద్ధరణకు ప్రోత్సాహం అందించాను. ఈ ఆటలో ప్రదర్శించాల్సిన ఒకేఒక్క అంశం వీరత్వం’ అంటూ ట్వీట్ చేశారు. భారత్‌లో నిర్వహిస్తున్న ‘ప్రోకబడ్డీ’ లీగ్‌కు ఆనంద్ మహీంద్రా కో-ఫౌండర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
హిమాలయాల్లోని ఎత్తైన కొండలపై సైనికులు కబడ్డీ ఆడి అలరించారు. దట్టమైన మంచు కురుస్తుండగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన సిబ్బంది కాసేపు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ పోటీపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు రేఖ వద్ద ఈ ఆటను ఆడి ఉల్లాసంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐటీబీపీ ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా ఈ వీడియోను మహీంద్రా రీ ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్