
Premature Baby- Guinness Record: ఆ శిశువు.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు
ఇంటర్నెట్ డెస్క్: నెలలు నిండకుండానే జన్మించిన ఆ శిశువు (premature baby) గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేశాడు. ఇదే విషయాన్ని బుధవారం గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Records)అధికారికంగా ప్రకటించింది. బతకడానికే తక్కువ అవకాశాలున్న ఆ శిశువు.. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గిన్నిస్లోనే చోటు సంపాదించేంతగా ఏం చేశాడు? ఆ శిశువు గొప్పతనం ఏమిటి? అది తెలుసుకోవాలంటే మనం గతేడాది జులై 2020కి వెళ్లాల్సిందే!
అమెరికాలోని అలబామాకు చెందిన మిషెల్లా ఒకే కాన్పులో కవల(మగ, ఆడ శిశువులకు)లకు జన్మనిచ్చారు. ట్విన్స్ (Twins) అనే ఆనందం ఓ పక్క.. ఇద్దరూ నెలలు నిండకుండా పుట్టారన్న ఆవేదన మరోపక్క. ఈ రెండింటి మధ్య తీవ్ర ఒత్తిడికి గురయ్యారామె. ఎందుకంటే.. సాధారణంగా గర్భిణులు సుమారు 280 రోజుల్లో (9నెలలు) బిడ్డకు జన్మనిస్తారు. కానీ తక్కువ వ్యవధి (148రోజులు)లోనే ఆమె కవలలకు జన్మనిచ్చారు. ఇక అప్పుడే పుట్టిన శిశువులు దాదాపు 3.5 కేజీల బరువు ఉంటారు. ఇక్కడ మాత్రం కవలలు కేవలం 450 గ్రాములతో జన్మించారు. దీంతో వారిని బతికించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు యూనివర్సిటీ ఆఫ్ అలబామా హాస్పిటల్ వైద్యులు. దురదృష్టవశాత్తూ అందులో ఆడ శిశువు చికిత్సకు సరిగ్గా స్పందించక ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ తల్లి గుండె మరింత బరువెక్కెంది. ఇక అబ్బాయి ‘కర్టిస్’ మీదే ఆశలు పెట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. పుట్టిన రోజు నుంచి 275 రోజులూ ఆస్పత్రి గదుల్లోనే చిక్సిత తీసుకుంటూ బతుకు పోరాటమే చేశాడు కర్టిస్. వైద్యులు అతడి ఊపిరితిత్తులకు బ్రీతింగ్ సపోర్ట్ ఇచ్చారు. గుండెపని చేసేందుకు చికిత్స అందించారు. బతికే అవకాశాలు తక్కువే అయినప్పటికీ.. కర్టిస్ శరీర భాగాలు చికిత్సకు అనుకూలంగా స్పందించాయి. దీంతో ఒక్కసారిగా మొత్తం అలబామా హాస్పిటల్ వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. అలా వరల్డ్ మోస్ట్ ప్రీమెచ్యూర్ బేబీగా కర్టిస్ గిన్నిస్‌లోకి ఎక్కాడు.
20ఏళ్లలో ఇలా జరగలేదు..
‘‘సుమారు 20 ఏళ్లుగా పసికందులకు చికిత్స ఇస్తున్నా. నా చేత్తో ఎంతో మందికి డెలివరీ చేశా. 148 రోజుల్లోనే కర్టిస్ పుట్టాడు. సాధారణంగా ఇంత తక్కువ వ్యవధిలో పుట్టిన పిల్లలు బతకరు. అలాంటి కర్టిస్.. ఎంత తక్కువ వ్యవధిలో పుట్టినా.. అంతే గట్టిగా ఉన్నాడు. చికిత్సకు స్పందిస్తున్నాడు. కర్టిస్ ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ.. ఇంకా సప్లిమెంట్ ఆక్సిజన్‌తో పాటు ఫీడింగ్ ట్యూబ్ అవసరం’’ అన్నారు ఈ ట్విన్స్‌ను డెలివరీ చేసిన డాక్టర్ బ్రియాన్ సిమ్స్, నియోనాటాలజిస్ట్ (పసికందు వైద్యులు).
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.