aloe vera: కలబందలో 5 అద్భుత ఔషధ గుణాలు.. ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు!

సాధారణంగా కలబందను గృహోపకరణంగా వినియోగిస్తూ ఉంటారు. సౌందర్య ఉత్పత్తుల తయారీకి, కేశ సంరక్షణకు విరివిగా వాడటం చూస్తూనే ఉంటాం. కానీ అందులో

Updated : 20 Oct 2022 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా కలబందను గృహోపకరణంగా వినియోగిస్తూ ఉంటారు. సౌందర్య ఉత్పత్తుల తయారీకి, కేశ సంరక్షణకు విరివిగా వాడటం చూస్తూనే ఉంటాం. కానీ అందులో దాగి ఉన్న ఔషధ గుణాలతో కొన్ని అనారోగ్యాలకు చెక్‌ పెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎడారి జాతి ముళ్ల మొక్కకు ఇంత ఆదరణ లభించడానికి కారణలేంటో తెలుసుకుందామా..

1.మలబద్ధకానికి ఔషధంగా..

మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నవారు కలబంద రసాన్ని తాగడం వల్ల ఆ సమస్యకు స్వస్తి పలకవచ్చు. ఈ మొక్క బయటి భాగం ఆంత్రాక్వినోన్స్‌ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా ఉపయోగపడతాయి. కలబంద రసం క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యకు చెక్‌ పడినట్లే. 

2. విటమిన్‌ సి అందించడం...

కలబంద రసంలో విటమిన్‌ సీ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ సీ మానవ శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే కలబందను ప్రకృతిలో లభించే సహజ యాంటీఆక్సీడెంట్‌గా అభివర్ణిస్తారు. హృదయ సంబధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ కలబంద రసం ఉపయుక్తంగాఉంటుంది. 

3.డీహైడ్రెషన్‌ నుంచి రక్షణ 

రోజులో క్రమం తప్పకుండా పానీయాలు, పండ్ల రసాలు తాగడం వల్ల మానవ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ వీటిలో వాడే చక్కెరలో ఉండే క్యాలరీల కారణంగా మనం అనుకున్న నిర్దిష్ట ప్రయోజనం చేకూరదు. అదే కలబంద రసాన్ని తాగడం వల్ల వీటికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. 

4.అల్సర్‌ను నివారిస్తుంది

కలబంద రసం కడుపు పూతల సంభవనీయతను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, అదనపు శక్తిని చేకూర్చుతుంది. ఈ రసంలో ఉండే విటమిన్‌ సీ వంటి అనేక రోగనిరోధక సమ్మేళనాలు జీర్ణక్రియను సక్రమంగా చేయడానికి సహాయపడతాయి. 

5.మధుమేహాన్ని నియంత్రిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రీడయాబెటిస్‌, టైప్‌2 డయాబెటిస్‌ ఉన్న వారి రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కలబంద రసాన్ని సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ మెరుగుపడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని