Ramadan: రేపటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం

ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.

Updated : 02 Apr 2022 20:54 IST

హైదరాబాద్‌: ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం నెలవంక  కనిపించడంతో మసీదుల్లో ప్రత్యేక  ప్రార్థనలు మొదలుకానున్నాయి. హైదరాబాద్‌లోని మక్కా మసీదును విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో రంజాన్‌ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సీఎం రంజాన్‌ శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ‘గంగజమునా తెహజీబ్‌’ మరింతగా పరిఢవిల్లాలన్నారు. రంజాన్‌ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను తేవాలని సీఎం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని