ట్రాఫిక్‌ కానిస్టేబుల్ దారిచ్చిన వృద్ధుడు క్షేమం

అబిడ్స్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జీ పరుగెడుతూ అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఘటనలో వృద్ధుడు క్షేమంగా ఇంటికి చేరాడు.

Published : 09 Nov 2020 20:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబిడ్స్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జీ పరిగెడుతూ అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఘటనలో వృద్ధుడు క్షేమంగా ఇంటికి చేరాడు. హయత్‌నగర్‌కు చెందిన వ్యక్తి గుండె, మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు మలక్‌పేట్‌ యశోద ఆసుపత్రికి తరలించారు. అబిడ్స్‌-కోఠి రోడ్డులో అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కానిస్టేబుల్‌ బాబ్జీ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. కానిస్టేబుల్‌ ట్రాఫిక్‌ను నియంత్రించిన వీడియోను వృద్ధుడి కూతురు, అల్లుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవుతున్న సమయంలో కానిస్టేబుల్‌ బాబ్జీకి వృద్ధుడు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టేబుల్‌ చేసిన సహాయానికి పోలీసు ఉన్నతాధికారులు, నెటిజన్లు అభినందించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని