TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్ మాస్టర్ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్ మాస్టర్ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితులు రవికిషోర్ అరెస్టుతో నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ విద్యుత్‌శాఖ డీఈతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితులు సురేశ్, రవికిషోర్, దివ్య, విక్రమ్ సైదాబాద్‌లో ఒకే భవన సముదాయంలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. సైదాబాద్‌లోని ఒక జిరాక్స్ కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు జిరాక్స్‌తీసి విక్రయించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని పలు కోచింగ్ సెంటర్ల వద్ద పేపర్ విక్రియించేందుకు నిందితులు తచ్చాడినట్టు దర్యాప్తులో తేలింది. రవికిశోర్ ఖాతాలో చాలా మందికి సంబంధించిన లావాదేవీలు బయటపడ్డాయి. ఏపీ పరీక్షలో పలువురు టాపర్లకు సంబంధించిన వివరాలు రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో గుర్తించారు. టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు 43 మందిని సిట్ అరెస్టు చేసింది. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)