Train: మిర్యాలగూడ స్టేషన్‌లో నిలిచిన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలు

హౌరా నుంచి సికింద్రాబాద్‌  వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు.

Updated : 06 Jul 2024 13:11 IST

నల్గొండ: హౌరా నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. శనివారం ఉదయం 8 గంటలకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన రైల్వే గాడ్‌.. రైలును స్టేషన్‌లో నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుంటూరులోని ఇంజినీరింగ్‌ అధికారుల బృందం మిర్యాలగూడకు వచ్చి సాంకేతిక లోపాన్ని సరిచేశారు. దీంతో రైలు 10.12 గంటలకు బయలుదేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు