Andhra University: పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.

Published : 21 Jun 2024 07:47 IST

విశాఖపట్నం (ఆంధ్రా యూనివర్సిటీ): తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఆమె ఆంధ్రా విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్త తరఫున ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు అప్పట్లో లావణ్యాదేవిని సస్పెండ్‌ చేశారు. తాజాగా ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని