chinna Jeeyar swamy: ప్రవేశానికి టికెట్‌ పెట్టాం.. సమతామూర్తి దర్శనానికి కాదు: చినజీయర్‌ స్వామి

కేవలం సమతామూర్తిని దర్శించుకోవడానికి టికెట్‌ పెట్టలేదని ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజీయర్‌ స్వామి స్పష్టం చేశారు. అదో పెద్ద ప్రాంగణమని.. దాంట్లో ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు..

Published : 19 Mar 2022 01:10 IST

విజయవాడ: కేవలం సమతామూర్తిని దర్శించుకోవడానికి టికెట్‌ పెట్టలేదని ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజీయర్‌ స్వామి స్పష్టం చేశారు. అదో పెద్ద ప్రాంగణమని.. దాంట్లో ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నిర్వాహణకు ఎంతో కొంత రుసుం పెట్టకపోతే వచ్చే సందర్శకులను నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. మామూలుగా ఇలాంటి ప్రాంగణాల సందర్శనకు టికెట్‌ ధరలు రూ.వేలల్లో ఉంటాయన్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉండేలా రూ.150 ప్రవేశ రుసుం కింద పెట్టినట్లు వెల్లడించారు. పైగా అక్కడ పూజల కోసం ఎటువంటి టికెట్లు లేవని.. ప్రసాదాలూ పూర్తి ఉచితమేనని వెల్లడించారు.

ఆ ఆలోచన మాకు లేదు.. రాదు..

‘‘రాజకీయాల్లో చేరాలనే ఆలోచన ఇప్పటివరకు రాలేదు. ఇకపై రాదు. మేం భిక్ష సన్యాసులం. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మాకు ఎవరితోనూ, ఎప్పుడూ ఎలాంటి వివాదాలు ఉండవు. మేం సమాజానికి కళ్ల లాంటి వాళ్లం. మా బాధ్యత మాకుంది. మేం ఎవరికీ భయపడం.. ఎవరి వెంటా పడం’’ అని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని