Gold and Silver: మురుగులోనుంచి బంగారం, వెండి వెలికితీత!

బెల్జియం రాజధాని నగరమైన బ్రస్సెల్స్‌లో శాస్త్రవేత్తలు మురుగులోనుంచి విలువైన బంగారం, వెండి లోహాలను వెలికితీస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అక్కడి శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా ఇలా రూ.11.23 కోట్ల విలువైన లోహాలను వెలికితీసినట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వెల్లడించింది. నగలు

Updated : 19 Aug 2021 04:07 IST

బ్రస్సెల్స్‌: బెల్జియం రాజధాని నగరమైన బ్రస్సెల్స్‌లో శాస్త్రవేత్తలు మురుగులోనుంచి విలువైన బంగారం, వెండి లోహాలను వెలికితీస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అక్కడి శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా ఇలా రూ.11.23 కోట్ల విలువైన లోహాలను వెలికితీసినట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వెల్లడించింది. నగలు కరిగిపోవడం.. ఔషధాలు, క్రిమిసంహారక మందుల నుంచి వెలువడే లోహాలు, డీజిల్ ఇంజిన్ ఉత్ప్రేరకాల కన్వర్టర్ల నుంచి వెలువడే పదార్థాలు మురుగులో కలిసిపోతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు మురుగులోంచి లోహాలు తీయడం ప్రారంభించారు. గతంలో ఈ మురుగునీటిని వ్యవసాయ ఎరువుగా వినియోగించేవారు. అయితే ఆ మురుగులో లోహాల శాతం అధికంగా ఉండటంతో ఎరువుగా వాడకుండా బెల్జియం ప్రభుత్వం నిషేధించింది.  దీంతో శాస్త్రవేత్తలు పర్యావరణ పద్ధతిలో బ్యాక్టీరియా సాయంతో మురుగు నీటిని శుద్ధి చేసి అందులో నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాలను బయటకు తీస్తున్నారు. 

స్విట్జర్లాండ్‌లో ప్రతి సంవత్సరం 95 పౌండ్ల విలువైన బంగారం మురుగునీటి పైపుల్లో ప్రవహిస్తోందని స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం వెల్లడించింది. మురుగునీటి పైపుల ద్వారా సుమారు 6,600 పౌండ్ల వెండి ప్రవహిస్తోందని ఆ అధ్యయనం పేర్కొంది. అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 2015లో ఈ తరహా అధ్యయనాన్నే ప్రచురించారు. ఒక మిలియన్ ప్రజలున్న అమెరికాలోని ప్రతి నగరంలో ఏటా 13 మిలియన్ల విలువైన లోహాలు మురుగునీటిలో ప్రవహిస్తున్నాయని వెల్లడించింది. ఆ లోహాల్లో దాదాపు 2.3 మిలియన్ల విలువైన బంగారం, వెండి ఉంటుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని