అమ్మాయిలూ పెళ్లికి సిద్ధమయ్యారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ పండగ. అమ్మాయిలకు మరీ ప్రత్యేకం అనే చెప్పవచ్చు...

Published : 02 May 2022 01:56 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ పండగ. అమ్మాయిలకు మరీ ప్రత్యేకం అనే చెప్పవచ్చు. అయితే పెళ్లి కుదిరిన హడావిడిలో చాలా విషయాలు మర్చిపోతారు. అందుకే ముందు నుంచే ప్రణాళిక చేసుకోవాలి. ఎలాంటి విషయాలను మర్చిపోకుండా సక్రమంగా చేసుకోవాలో తెలుసుకోండి మరీ! 

* పెళ్లికి ఎలా ముస్తాబవ్వాలనుకుంటున్నారో ముందే ఓ అంచనా వేసుకోవాలి. వీలైతే అవసరమైన వాటి వివరాలు రాసుకుంటే మంచిది. పెళ్లికి ఎలాంటి దుస్తులు తీసుకున్నారో వాటికి తగిన మ్యాచింగ్‌ కూడా ముందే కొనాలి. లేదంటే పెళ్లి హడావిడిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

* ఎన్ని కొన్నా సమయానికి దొరకని వస్తువుల్లో సేఫ్టీ పిన్నులు, హెయిర్‌ పిన్నులు ముందు వరుసలో ఉంటాయి. ఇవి ఆడవాళ్లకు సరైన సమయంలో  దొరకకుండా ఎన్నో తిప్పలు పెడతాయి. అందుకే పెళ్లిరోజు కోసమని తీసుకొన్న సామగ్రిని బయటకు తీయకూడదు. ఆ రోజు కోసమని పక్కన పెట్టిన సామగ్రితోనే వీటిని కూడా పక్కన పెడితే మంచిది. మేకప్‌ ఐటమ్స్‌ అంతా ఒకే బ్యాగ్‌లో సర్దుకోవాలి. 

*  అసలే వేసవికాలంలో పెళ్లంటే ఎండకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది మరీ! అందుకే ఫేస్‌ వెట్‌ వైప్‌లను దగ్గర ఉంచుకోవాలి. 

* సాధారణంగా పెళ్లి అనగానే ఎక్కడలేని హంగామా మొదలవుతుందీ! ముహూర్తం కుదిరింది మొదలు ఆ పనీ ఈ పనీ అంటూ అసలు తీరిక ఉండదు. కానీ పెళ్లి కూతుర్లు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నీరసం వస్తుంది. దీంతో ఆ నీరసమంతా ముఖంలో కనిపిస్తుంది.

* ఎన్ని పనులు ఉన్నా.. కడుపు నిండా తినాలి. కంటి నిండా నిద్ర పోవాలి. అపుడే ముఖం కాంతివంతంగా అందంగా ఉంటుంది. 

* ఎక్కడున్నా వాటర్‌ బాటిల్‌ వెంట ఉంచుకోవాలి. ఎక్కువగా నీటిని తీసుకోవాలి. జ్యూస్‌లు ఎక్కువగా తాగాలి. ఆరోగ్యాన్ని మాత్రమే కాదు. అందాన్ని కూడా కాపాడుతాయి. 

* స్నేహితులందరికీ, బంధువులకు ముందుగానే ఆహ్వానాన్ని పంపేయండి. 

* సాధారణంగా పెళ్లి కుదరగానే అమ్మాయిలు రకరకాల ఆలోచనల్లో పడిపోతారు. కొత్త జీవితం ఎలా ఉంటుందో ఏమో?, అత్తగారింట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో? వారిని మెప్పించగలనా? ఇలా చాలా సందేహాలుంటాయి. వీటితో పాటు ఎన్నోకలలు కూడా ఉంటాయి. కానీ ఇవేవీ ఆలోచించకండి. అందమైన దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అనవసరపు ఆలోచనలను మనసులోనికి రానివ్వకుండా ఉంటే మంచిది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని