Burger Eat challenge: 20వేల కేలరీల బర్గర్‌.. 4 నిమిషాల్లో తినేశాడు! వీడియో చూడండి!

తక్కువ సమయంలో స్పీడ్‌గా ఆహారాన్ని తినాలనే ఛాలెంజ్‌ల గురించి మనందరికీ తెలుసు

Updated : 23 Aug 2021 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ సమయంలో స్పీడ్‌గా ఆహారాన్ని తినాలనే ఛాలెంజ్‌ల గురించి మనందరికీ తెలుసు. ఈ ఛాలెంజ్‌లను స్వీకరించి కొందరు ప్రపంచరికార్డులు కూడా బద్దలు కొడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అందరినీ అలరిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి బర్గర్ మీద ఉన్న అతి ఇష్టంతో 20వేల కేలరీల భారీ బర్గర్‌ను 4 నిమిషాల్లో లాగించేశాడు. ఈ బర్గర్ బరువు 2.94 కిలోలు ఉంటుందట. దీన్ని 40 బేకన్ ముక్కలు, 8.5 పట్టీలు, 16 చీజ్ ముక్కలు, ఉల్లిపాయ, రెండు టమోటాలు, మిర్చి, బన్స్‌తో తయారు చేశారని చెబుతున్నారు.

మాట్ స్టోనీ అనే వ్యక్తి లాస్ వేగాస్‌లోని హార్ట్ ఎటాక్ గ్రిల్‌ అనే రెస్టారెంట్ నిర్వహించిన ఆక్టపల్ బైపాస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా భారీ బర్గర్‌ను రికార్డు సమయంలో 4:10 నిమిషాల్లో పూర్తిగా తినేశాడు. ఈ ఛాలెంజ్ వీడియోను 14.6 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్న తన యూట్యూబ్ ఛానెల్‌లో కొద్ది రోజుల క్రితం అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే 78 లక్షల మంది వీక్షించారు. అలాగే 39 లక్షలకు పైగా లైక్‌లు, వేలల్లో కామెంట్స్‌ కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మికి సుడో అనే వ్యక్తి పేరిట 7:42 నిమిషాల్లో ఉన్న రికార్డును ఇతడు చెరిపేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని