Viral videos: కుల్లడ్‌ పిజ్జా.. కేరాఫ్‌ సూరత్‌

పిజ్జా.. నోరూరించే ఈ ఇటాలియన్‌ డిష్‌ గురించి దాదాపు అందరికి తెలిసిందే. గుండ్రటి పిజ్జా బేస్‌పై సాస్‌ అప్లై చేసి, వివిధ కూరగాయలు లేదా మాంసం ముక్కలతో టాపింగ్‌ చేసి, దానిపై ఛీజ్‌ పరిచి చేస్తుంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసిన రకం పిజ్జా. కానీ.. కుల్లడ్‌ పిజ్జా గురించి విన్నారా?...

Published : 26 Sep 2021 01:44 IST

ఆకట్టుకుంటున్న తయారీ విధానం.. వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిజ్జా.. నోరూరించే ఈ ఇటాలియన్‌ డిష్‌ గురించి దాదాపు అందరికి తెలిసిందే. గుండ్రటి పిజ్జా బేస్‌పై సాస్‌ అప్లై చేసి, వివిధ కూరగాయలు లేదా మాంసం ముక్కలతో టాపింగ్‌ చేసి, దానిపై ఛీజ్‌ పరిచి చేస్తుంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసిన రకం పిజ్జా. కానీ.. కుల్లడ్‌ పిజ్జా గురించి విన్నారా? పేరే వింతగా ఉంది కదూ. అవును.. తయారీ విధానం కూడా అంతే. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ దుకాణదారుడు.. పిజ్జా బేస్‌ లేకుండానే కుల్లడ్‌(మట్టి గిన్నె)లో దీన్ని తయారు చేస్తూ, ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. దీని తయారీ కోసం.. మొదటగా ఉడికించిన మొక్కజొన్న పొత్తులు, తరిగిన టమాటాలు, పన్నీర్‌ ముక్కలు, కెచప్‌, మయోనీస్‌, వివిధ రకాల సాస్‌లతో మిశ్రమాన్ని తయారు చేసి.. చిన్న మట్టి కుండలో నింపుతున్నాడు. అనంతరం.. ఆ మిశ్రమంపై మళ్లీ సాస్‌లు, ఉప్పు, చాట్‌ మసాలా, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌, పెద్ద ఎత్తున ఛీజ్‌ వేస్తున్నాడు. గిన్నె పూర్తిగా నిండాక, మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఉంచి.. వేడివేడిగా అందిస్తున్నాడు. ఆకట్టుకునేలా ఉన్న ఈ తయారీ వీడియోను ‘ఆమ్చీ ముంబయి’ అనే ఛానల్‌ యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 23 లక్షల వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లూ ఈ వీడియోపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘ఈ వీడియో గనుక చూస్తే ఇటలీకి చెందిన మా బామ్మ మాపై యుద్ధం ప్రకటిస్తుంది’ అని ఒకరు, ‘అతని ప్రయత్నాన్ని అభినందించండి. నేను భారతీయుడిగా గర్వపడుతున్నా. మేం ఎప్పుడూ వినూత్న పరిష్కారాలు కనుగొంటాం’ అని మరొకరు.. ‘ఫస్ట్‌ టైం బేస్‌ లేని పిజ్జా చూస్తున్నా’.. ‘ఇది పిజ్జా కాదు.. ‘పాట్‌’జా’.. ‘అద్భుతమైన వంటకం, సృజనాత్మకంగా ఉంది. తినేందుకు ఎదురుచూస్తున్నా..’ ఇలా పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. దీని తయారీ వీడియోను మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని