Published : 18 Feb 2022 01:31 IST

Nitin gadkari: ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు: నితిన్‌ గడ్కరీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇక్కడ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవి. వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర. గ్రామాల అనుసంధానతకు వాజ్‌పేయీ అనేక చర్యలు తీసుకున్నారు. దేశాభివృద్ధికి గ్రామాల అనుసంధానం ఎంతో కీలకం అని వాజ్‌పేయీ భావించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లను కేటాయిస్తాం. ఏపీలో 3 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం. 2024లోగా రాయ్‌పూర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే అందుబాటులోకి తీసుకొస్తాం. నాగ్‌పూర్‌-విజయవాడ, బెంగళూరు-చెన్నై మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తాం. రూ.5వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేని పూర్తి చేస్తాం’’ అని గడ్కరీ వెల్లడించారు.

కాలుష్యం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గడ్కరీ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌కు బదులుగా వాహనాల్లో సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ వాడాలని సూచించారు. భవిష్యత్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఈ దేశంలో రైతులు కేవలం అన్నదాతలే కాదని.. విద్యుత్‌ ఉత్పత్తిదారులుగా మారతారని పేర్కొన్నారు. ఇథనాల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి దిశగా, బయో ఇంధనాల ఉత్పత్తికి ఏపీ మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. లాజిస్టిక్‌ పార్కుల కోసం రాష్ట్ర భూమి కేటాయించాలని సీఎం జగన్‌ను కోరారు. ఏపీ 20 ఆర్‌వోబీలు అడిగితే.. కేంద్రం 30 ఆర్‌వోబీలు మంజూరు చేసిందని నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని