Hyderabad: ముగిసిన తొర్రూరు లేఅవుట్ ప్లాట్ల ఈ-వేలం

తొర్రూరు లేఅవుట్ ప్లాట్ల ఈ-వేలం ముగిసింది. మొత్తం 48 ప్లాట్లకు గాను నిర్వహించిన వేలంలో 12 ప్లాట్లకు బిడ్స్ దాఖలయ్యాయి. గజం ధర అత్యధికంగా రూ.30 వేలు, అత్యల్పంగా

Updated : 04 Jul 2022 22:03 IST

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తొర్రూరు హెచ్ఎండీఏ లేఅవుట్‌లో మిగిలిన ప్లాట్ల అమ్మకాలకు చివరి రోజున 48 ప్లాట్లకు ఆన్‌లైన్‌ ద్వారా వేలం ప్రక్రియ జరిగింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన వేలంలో ఉదయం సెషన్‌లో 25 ప్లాట్లు, సాయంత్రం సెషన్‌లో 23 ప్లాట్ల చొప్పున వేలం ప్రక్రియను నిర్వహించారు. ఉదయం సెషన్‌లో 25 ప్లాట్లకు గాను 5 ప్లాట్లకు బిడ్డింగ్ జరిగింది. గజం ధర అత్యధికంగా రూ.30 వేలు, అత్యల్పంగా రూ.20,500 బిడ్డర్లు కోట్ చేశారు. సాయంత్రం సెషన్‌లో 23 ప్లాట్లకుగాను 7 ప్లాట్లకు బిడ్డింగ్ జరిగింది. చివరి రోజు వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.8.10 కోట్ల విలువ చేసే 12 ప్లాట్ల విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని