సీఎం కుమార్తె కేసులో ముగ్గురి అరెస్టు

దిల్లీ ముఖ్యమంత్రి కుమార్తెను సైబర్‌ మోసానికి గురిచేసిన వారిలో ముగ్గురు నిందితులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మోసానికి పాల్పడ్డ సాజిద్‌, కపిల్‌, మన్వేంద్ర అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు....

Published : 16 Feb 2021 01:28 IST

దిల్లీ: కేజ్రీవాల్‌ కుమార్తెను సైబర్‌ మోసానికి గురిచేసిన వారిలో ముగ్గురు నిందితులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మోసానికి పాల్పడ్డ సాజిద్‌, కపిల్‌, మన్వేంద్ర అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు చిక్కలేదని, అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ కుమార్తె హర్షిత ఫిబ్రవరి 7న ఓఎల్‌ఎక్స్‌లో ఓ సోఫాను అమ్మకానికి ఉంచారు. కొనుగోలుదారుడిగా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆమెను పరిచయం చేసుకొని సోఫా కొంటానని పేర్కొన్నాడు. క్యూఆర్‌ కోడ్‌లు పంపి వాటిని స్కాన్‌ చేస్తే తాను చెల్లించే డబ్బు ఖాతాలో జమ అవుతుందని చెప్పాడు. హర్షిత వాటిని స్కాన్‌ చేయగా మొదట రూ.20 వేలు, అనంతరం మరో రూ. 14 వేలు ఆమె ఖాతాలో నుంచి మాయమయ్యాయి. ఈ సైబర్‌ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి...

సైబర్‌ మోసం బారిన సీఎం కుమార్తె

అంతరిక్షంలోకి మోదీ ఫొటో..!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని