Hyderabad: ఇంటి గోడ కూలి ముగ్గురి చిన్నారులకు గాయాలు
పాత ఇంటి గోడ కొంతభాగం కూలి ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని మూసాపేట్ ప్రగతి కాలనీలో శనివారం రాత్రి జరిగింది.

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి మూసాపేట్ ప్రగతి నగర్ కాలనీలో పాత ఇంటి గోడ కొంతమేర కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి కాలు విరగ్గా.. మరో ఇద్దరు చిన్నారులకు తలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పాత ఇంటి గోడ కొంతభాగం కూలి కింద పడినట్లు తెలుస్తోంది. అయితే, చిన్నారులు గోడ పైన ఉన్నారా? కింద ఉన్నారా? అనే దానిపై స్పష్టత రాలేదు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన