ఏపీ: కాన్సెప్ట్ సిటీలుగా మూడు జిల్లాలు
దేశంలోనే తొలిసారిగా కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అనంతపురం, తిరుపతి, విశాఖలను కాన్సెప్టు సిటిలుగా రూపకల్పన చేసి వాణిజ్య వ్యూహాలు, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల
అమరావతి: దేశంలోనే తొలిసారిగా కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అనంతపురం, తిరుపతి, విశాఖలను కాన్సెప్టు సిటీలుగా రూపకల్పన చేసి వాణిజ్య వ్యూహాలు, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు ఆయా నగరాలు సుస్థిరాభివృద్ధి కేంద్రాలుగా తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. పూర్తిస్థాయి అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచ దేశాలను ఆకర్షించే స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ నగరాలను తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. కాన్సెప్ట్ సిటీలను సహజసిద్ధంగా ఉండేలా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు కాన్సెప్ట్ సిటీల్లో పెట్టుబడుల ఆకర్షణ, వాణిజ్య వ్యూహాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురంలో తొలి కాన్సెప్ట్ సిటీ ప్రణాళిక రూపకల్పన బాధ్యతల్ని ఏపీ ప్రభుత్వం సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. కాన్సెప్ట్ సిటీ ప్రణాళిక రూపకల్పన కోసం రూ.84.85లక్షలు ఖర్చు చేసేందుకు పాలనా అనుమతి ఇస్తూ పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనాశాఖ ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాన్సెప్ట్ సిటీల్లో వాక్ టు వర్క్ అనే అంశంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్