Ship Journey: ఎంత దయనీయం.. ఉపాధి కోసం ఓడ చుక్కానిపైనే 11 రోజులు ప్రయాణం!
జీవనోపాధి కోసం పేద దేశాలకు చెందిన ప్రజలు సంపన్న దేశాలకు వలసపోతున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా వారు ప్రయాణిస్తున్న తీరు ప్రపంచ దేశాలన నివ్వెరపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అభివృద్ధి పథంవైపు పయనిస్తుంటే.. మరికొన్ని దేశాల్లో మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉన్నచోట జీవనోపాధి కరవై, పట్టెడన్నం కోసం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని సంపన్న దేశాలకు వలసపోతున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా నైజీరియా నుంచి యూరప్‌కు వెళుతున్న ఓ నౌకలో ముగ్గురు వలస జీవులు ప్రయాణించిన తీరు, అక్కడి దయనీయ పరిస్థితికి అద్దంపడుతోంది.
అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అలిథిని-2 (Alithini II) అనే నౌక చమురు, రసాయనాలతో నైజీరియా నుంచి యూరప్‌కు ప్రయాణిస్తోంది. 11రోజుల ప్రయాణం తర్వాత ఈ నౌక స్పెయిన్‌లోని క్యానరీ ఐలాండ్ తీరానికి చేరింది. ఆ సమయంలో స్థానిక కోస్ట్ గార్డులు ఓడ చుక్కానిపై ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉండటం గమనించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నైజీరియాలోని లాగోస్ నుంచి ఓడ చుక్కానిపై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురిలో 11 ఏళ్లలోపు బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోను సాల్వమెంటో మెరైన్ సంస్థ ట్విటర్‌లో షేర్ చేసింది.
11 రోజులపాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడం వల్ల ముగ్గురు డీహైడ్రేషన్‌కు గురికావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వలసదారుల దయనీయస్థితి ఈ ఫొటో నిదర్శనం’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘నేను ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వాడినే, మా దేశాల్లో ఈ పరిస్థితికి ఆఫ్రికా దేశాలను పాలిస్తున్న నాయకుల విధానాలే కారణం. వారు అభివృద్ధికి వ్యతిరేకం. నలభై ఏళ్లపాటు ఒకే వ్యక్తి ఎలా దేశాన్ని పాలిస్తాడు’’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 2011 తర్వాత ఉత్తర ఆఫ్రికా ప్రాంతం నుంచి పాశ్చాత్య దేశాలకు వలస వచ్చే వారి విషయంలో నిబంధనలు కఠినతరం చేయడంతో కొందరు ఇలా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: రూ.87 కోట్ల ఆస్తిని రూ.11 కోట్లకే కొట్టేశారు
-
Crime News
Nellore: మేనమామ అత్యాచారయత్నం.. 5 నెలలు మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక
-
World News
Flight: 13 గంటలు ప్రయాణించి టేకాఫ్ అయిన చోటే ల్యాండింగ్..
-
Crime News
Crime News: రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల దారుణహత్య
-
Crime News
కుమార్తెలను చదివించేందుకు అప్పులు.. తీర్చలేక అమ్మ బలవన్మరణం
-
India News
బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా..