TDP: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. మరో ముగ్గురి అరెస్టు

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి ఉన్నారు.

Published : 06 Jul 2024 13:58 IST

గుంటూరు: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో పలువురు వైకాపా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

ఇటీవల నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలనుసేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తెదేపాలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని