
Published : 19 Jan 2022 01:34 IST
నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జననం
కఠిహార్: బిహార్ కఠిహార్ జిల్లాలో కఠిహార్ సర్దార్ ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును చూసేందుకు జనం భారీగా ఆసుపత్రికి వస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భధారణ సమయంలో లోపల పెరుగుతున్న కవలలకు సరైన ఎదుగుదల లేకపోవడం వల్లే ఇలా జరిగిందని..ఈ శిశువు దివ్యాంగుడని సదర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వైద్యుల చికిత్సలో కూడా లోపం ఉందంటూ గర్భిణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :