కాకినాడ జిల్లాలో పులి కలవరం.. బంధించేందుకు 120మంది సిబ్బంది

జిల్లాలో పులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. ప్రత్తిపాడు మండలంలో రాత్రి వేళ పశువులపై దాడి చేస్తూ,

Updated : 29 May 2022 13:26 IST

కాకినాడ: జిల్లాలో పులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. ప్రత్తిపాడు మండలంలో రాత్రి వేళ పశువులపై దాడి చేస్తూ, నీరు తాగేందుకు స్థానికంగా ఉన్న కాల్వల వద్దకు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, శరభవరం, ధర్మవరం గ్రామాల్లో పశువులపై దాడి చేసి ఆరు గేదెల్ని చంపేసిందని వారు తెలిపారు. దీంతో పులిని బంధించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో పోతులూరు వద్ద స్థానిక సర్పంచ్‌లతో అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. పులిని బంధించేందుకు ఈ సాయంత్రానికి అది సంచరించే ప్రాంతానికి బోన్లను తరలించనున్నారు. దాన్ని పట్టుకోవడానికి 120 మంది అటవీ సిబ్బందికి ప్రత్యేకంగా విధులు కేటాయించారు. అటవీశాఖ ముఖ్య అధికారి శరవనన్ ఆధ్వర్యంలో అధికారుల దీన్ని పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించేందుకు వారం రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని