TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు .. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవనీత కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహనసేవ ముందు కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకుంటాయి. ఉదయం రథోత్సవం, రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. శ్రీవారి వాహన సేవలో తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. -
ఉత్తరాంధ్ర దోపిడీ.. వైకాపా నేతలకు కనిపించలేదా!!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య