తిరుమలలో ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.

Updated : 19 Sep 2023 06:21 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేశారు. వేదపండితుల మంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించే పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు. 

మరోవైపు, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగులు వేయనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. స్వయంగా ప్రొటోకాల్‌ ప్రముఖులనే అనుమతించనున్నారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు