Tirumala Brahmotsavam: మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు.

Updated : 22 Sep 2023 11:28 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు. మరోవైపు, విశిష్టమైన శ్రీవారి గరుడవాహనసేవ శుక్రవారం రాత్రి 7 గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. గరుడసేవలో సర్కారు హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు అనుమతించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని