Tirumala: తిరుమలలో వైభవంగా చిన్నశేష వాహన సేవ

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా...

Updated : 28 Sep 2022 12:24 IST

తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాత్రి 7 గంటల తర్వాత హంస వాహన సేవ నిర్వహించనున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్‌

తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంగళవారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. బుధవారం ఉదయం మళ్లీ దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పరకామణి భవన సముదాయాన్ని జగన్‌ ప్రారంభించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని