Tirumala brahmotsavasm: వీణాపాణిగా శ్రీనివాసుడు.. వైభవంగా హంస వాహన సేవ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి శ్రీవారు హంస వాహనంపై ప్రకాశించారు.

Updated : 19 Sep 2023 22:09 IST

తిరుమల: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారికి హంస వాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి హంస వాహనంపై విహరించారు. హంస చదువుల తల్లి సరస్వతి వాహనం. వీణను ధరించిన స్వామి సరస్వతి రూపంలో  విజ్ఞానాన్ని భక్తులకు ప్రసాదిస్తాడు. విజ్ఞానంతో అంధకారాన్ని పారద్రోలవచ్చు. అందుకే విద్యకు అంతటి ప్రాధాన్యముంది. హంస పాలను, నీళ్లను వేరుచేయగలదు. నిత్య జీవితంలో  ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలంటే విజ్ఞానం అవసరం. అందుకనే స్వామివారు విజ్ఞానదాతగా తిరువీధుల విహరించారు. ఈ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే సాత్వికమైన ప్రవృత్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. 

తిరుమల మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన హంస వాహ‌న‌ సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఆకట్టుకున్నాయి. శ్రీవారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. మరోవైపు, బ్రహ్మోత్సవాలలో బుధవారం ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ‌లు నిర్వహించనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని