Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు

తిరుమలలోని నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. భక్తులు చూసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 05 Feb 2023 12:10 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును తితిదే అధికారులు ప్రారంభించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలను అక్కడి నుంచి ఆలయానికి సమీపంలోని నూతన పరకామణి భవనంలోకి ఇవాళ ఉదయం తరలించారు. ప్రత్యేకమైన ట్రాలీలు, క్రేన్ల ద్వారా లారీల్లో హుండీలను తీసుకెళ్లారు. 

భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం లెక్కింపును ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ పరకామణిలో రెండు వందల మంది సిబ్బంది ఒకేసారి కూర్చొని కానుకలు లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు హుండీ కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా తితిదే అధికారులు పెద్ద అద్దాలను ఏర్పాటు చేసి క్యూలైన్లలో భక్తులను అనుమతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని