Tirumala: ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. 

Published : 17 Jun 2024 21:58 IST

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనుంది. మరోవైపు, మంగళవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు తితిదే అవకాశం కల్పించింది. ఆ రోజున మరిన్ని టికెట్లు విడుదల చేయనుంది. 

  • ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లు విడుదల
  • ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల
  • ఈ నెల 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల
  • ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు విడుదల
  • ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని