Telangana News: 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ.. దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో స్టాఫ్‌నర్సు పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణకు తుది గడువును టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ పొడిగించింది.

Published : 16 Feb 2023 01:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఇటీవల నియామక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణకు తుది గడువును తొలుత ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటలుగా ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఈ గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది. 

దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాల్లేవని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెల్లడించింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో అన్నీ బహుళ ఐచ్ఛిక (మల్టీపుల్‌ ఛాయిస్‌) ప్రశ్నలే ఉంటాయి. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. వీరికి వేతనం స్కేలు రూ.36,750-1,06,990గా పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు అన్నీ కూడా వర్తిస్తాయి. స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్‌ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని